Tuesday, 27 October 2015

Human life is more important than Caste

భారత దేశం లో కులం అనేది ఒక అనాగరిక ఆచారం లాంటిది. సతీసహగమనం మరియు  అంటరాని తనం వీటిని అనాగరికo అని వాటిని పూర్తిగా రూపుమాపడానికి ఎందరో మహానుభావులు ఎన్నో సంవత్సరాలు పోరాడి వాటిని కనీసం నియంత్రించగలిగారు కానీ ఈ కులం అనే మాట ఇప్పటికి వినిపిస్తుంది కొంతమంది స్వార్ధపరులు అయిన రాజకీయనాయకులు వలన ఈ కుల వ్యవస్థ ఇంకా గుంట నక్కల సామ్రాజ్యం లాగా రాజ్యం ఏలుతుంది.

ప్రపంచం ఏదో సాధించాం  అని చంకలు గుద్దుకున్న సందర్భాలు ఎన్నో వున్నాయి అందులో అరుణ గ్రహం పైకి వెళ్ళడానికి, చందమామ పై నీళ్ళు కనిపెట్టి తాగడానికి ఎందుకు తొందర అక్కడ కూడా కులాలని పెట్టి తక్కువ కులం వాళ్ళని అక్కడికి పంపదానికా లేక అగ్ర కులాలను అక్కడికి తరలించడానికా? లేదు డబ్బువున్నవాళ్ళు అక్కడ ఇక్కడ అని మార్చడానికా? ఎందుకు మనకి ఈ గ్రహాంతర అవరోహణలు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగాలు ప్రయాసలు.

లేని వారికీ జీవితం ఇవ్వడంలో వున్నా ఆనందం వీటిలో దొరుకుతుందా? కులాలని దూషించి వారిని మానసిక క్షోభలకు గురిచేసి రాక్షస ఆనందాన్ని పొందాలా? మనం పుట్టిన తరువాత వచ్చిన కులాలకు ఇంత విలువ ఇస్తున్నారు ఎప్పుడో పుట్టిన మనవ జాతికి ఇవ్వరా అండి. మనలో మార్పు వొస్తే ఇంట్లో, ఊరిలో, జిల్లలో, రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో  వొస్తుంది.